: ఆ కానిస్టేబుళ్లిద్దరూ ‘గే’లట!
కర్నూలు జిల్లా కేంద్రంలోని ఆర్మ్ డ్ రిజర్వ్ డ్ క్వార్టర్స్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు వీరేశ్, మురళీకృష్ణారెడ్డి తమను తాము కాల్చుకుని చనిపోయారు. ఈ ఘటన ఒక్క కర్నూలులోనే కాక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇందుకు గల కారణాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలోని కృష్ణగిరి పోలీస్ స్టేషన్ లో వీరేశ్ పనిచేస్తుండగా, మురళి మాత్రం ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వద్ద గన్ మన్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలం క్రితం పరిచయమైన వీరిద్దరి మధ్య ‘గే’ (స్వలింగ సంపర్కం) బంధం ఏర్పడింది. మురళికి చెందిన ఏర్ క్వార్టర్ లో తరచూ కలుసుకునే వీరు లైంగిక కార్యకలాపాల్లో మునిగిపోయేవారట. ఇటీవలే మురళికి గోకులపాడుకు చెందిన ఓ యువతితో పెళ్లి సంబంధం కుదిరింది. దీంతో తమ మధ్య బంధం తెగిపోతుందని వీరేశ్ ఆవేదనతో పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో నిన్న కర్నూలులో మురళిని కలిసిన వీరేశ్ మరింత ఒత్తిడికి గురై తన తుపాకీతో కాల్చేసుకుని తనువు చాలించాడు. దీంతో హతాశుడైన మురళి, తమ ‘గే’ బంధం ఎక్కడ బయటపడుతుందోనని ఆందోళన చెంది తనను తాను కాల్చుకున్నాడు.