: తాడేపల్లిగూడెంలో దోపిడీ దొంగల బీభత్సం... కాల్పులకు తెగబడ్డ దొంగలు


పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గత రాత్రి దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. జనం నిద్రకు ఉపక్రమించకముందే రంగంలోకి దిగిన దుండగులు రిటైర్ట్ ఉద్యోగి స్వామి ఇంటిలోకి చొరబడ్డారు. తుపాకీ చేతబట్టి ఓ దొంగ ఇంటి లోపలికి వెళ్లగా, ఇద్దరు దుండగులు బయట కాపలాగా ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిలోకి చొరబడ్డ దొంగను స్వామి కుటుంబ సభ్యులు అడ్డుకునే యత్నం చేశారు. దీంతో అతడు తన చేతిలోని తుపాకీతో మూడు రౌండ్లు కాల్పులు జరిపి, వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. కాల్పుల శబ్దం విన్న స్థానికులు అక్కడికి చేరుకోవడంతో దొంగలు తమ పనికి స్వస్తి చెప్పి పరుగు లంకించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు చెప్పారు.

  • Loading...

More Telugu News