: రాణించిన ఢిల్లీ బౌలర్లు...స్వల్ప స్కోరుకే పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్


చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్ మన్ ను ఢిల్లీ డేర్ డెవిల్స్ బౌలర్లు బేజారెత్తించారు. నిప్పులు చెరిగే బంతులతో నదీమ్, జహీర్ ఖాన్ రాణించడంతో చెన్నై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. నదీమ్, జహీర్ విసిరిన బంతులను ఎలా ఎదుర్కోవాలో తెలియని స్మిత్ (18), మెక్ కల్లమ్ (11) మెరుపు ఆరంభం ఇవ్వలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన రైనా (11) ను యాదవ్ పెవిలియన్ బాటపట్టించాడు. క్రీజులో కుదురుకుంటున్న డుప్లెసిస్ (29) ను ఆల్బీ మోర్కెల్ బౌల్డ్ చేశాడు. ధోనీ (27) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ జహీర్ ఖాన్ ముందు ఆటసాగలేదు. బ్రావో (8)ను సంధు అవుట్ చేయడంతో నేగి (5), జడేజా (3) నాటౌట్ గా మిగిలారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, ఆల్బీ మోర్కెల్ చెరి రెండు వికెట్లతో రాణించగా, సంధు, యాదవ్ చెరో వికెట్ తీసి వారికి చక్కని సహకారమందించారు. 120 పరుగుల విజయ లక్ష్యంతో ఢిల్లీ బ్యాటింగ్ ప్రారంభించింది.

  • Loading...

More Telugu News