: కర్నూలులో గన్ తో కాల్చుకుని చనిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్లు!
కర్నూలులో ఇద్దరు కానిస్టేబుళ్లు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. వారిని వీరేశ్, మురళీకృష్ణారెడ్డిగా గుర్తించారు. గన్ తో కాల్చుకుని వారు ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. కాగా, మురళీకృష్ణారెడ్డి ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గన్ మన్ అని తెలిసింది. టూటౌన్ పరిధిలోని పోలీస్ క్వార్టర్స్ లో ఘటన జరిగింది. వీరి మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.