: పీఠాధిపతులను సంప్రదించకుండా పుష్కరాలా?: స్వరూపానందేంద్ర


గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఘాటుగా స్పందించారు. పుష్కరాలు పవిత్రమైనవని, అలాంటప్పుడు పీఠాధిపతులను సంప్రదించకుండా, కేవలం అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ... గోదావరి పుష్కర పనుల్లో భారీగా అవినీతి చోటు చేసుకుంటోందని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏదేమైనా, ప్రభుత్వ పనితీరు సవ్యంగా లేదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ క్షేత్రాల్లో గోవులు ప్రాణాలు విడుస్తుంటే సర్కారు ఏం చేస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News