: ఇంకా దొరకని యూపీ మంత్రి కుమార్తె మృతదేహం


ఉత్తరప్రదేశ్ మంత్రి షాహిద్ మంజూర్ కుమార్తె అబిదా హసన్ (24) రిషికేశ్ వద్ద గంగానదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. మీరట్ సుభార్తి మెడికల్ కాలేజిలో వైద్య విద్య అభ్యసిస్తున్న అబిదా టూర్ నిమిత్తం ఉత్తరాఖండ్ వెళ్లగా, అక్కడ ప్రమాదవశాత్తు గంగా నదిలో పడిపోయింది. ప్రవాహ తీవ్రత కారణంగా నిమిషాల్లోనే ఆమె కనిపించకుండాపోయింది. సమాచారం అందుకున్న ఉత్తరాఖండ్ అధికార వర్గాలు వెంటనే గాలింపు చర్యలకు ఉపక్రమించాయి. ఆర్మీ డైవర్లను, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికీ ఆమె ఆచూకీ తెలియరాలేదు.

  • Loading...

More Telugu News