: కొడుకును వెనకేసుకొచ్చిన టీడీపీ ఎమ్మెల్యే
తన చిన్న కుమారుడి జన్మదినం సందర్భంగా రెండు కార్లతో ర్యాలీకి వెళితే, రెండువేల కార్లతో వెళ్లినట్టుగా రాద్ధాంతం చేయడం తగదని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. తన కుమారుడు ఏ తప్పూ చేయలేదని తెలిపారు. గతంలోనూ కొందరు అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహించారని చెప్పారు. కొన్ని మీడియా సంస్థలు గోరంత విషయాన్ని కొండంత చేసి చూపుతున్నాయని మండిపడ్డారు. కొన్ని టీవీ చానళ్లు ప్రసారం చేసిన ర్యాలీ క్లిప్పింగ్స్ లో రెండు కార్లు, 15 బైకులు కనిపించాయని, ఆ బైకులపై ఇద్దరిద్దరే ఉన్నారని, అలాంటప్పుడు కొన్ని చానళ్లు ఒక్కో బైకుపై నలుగురు ఎక్కారని ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. విజయవాడలో తన ఇంటి నుంచి లబ్బీ పేటకు అర కిలోమీటరు దూరం ఉంటుందని, దానికి రేసులని, ర్యాలీలని ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేశారనుకుంటే, రోడ్లపై సీసీ కెమెరాలు ఉన్నాయని, చలానాలు పంపుకోవచ్చని అన్నారు.