: హైదరాబాదు, కోఠిలో హోర్డింగ్ ఎక్కి, హోంగార్డు హల్ చల్
తనపై అధికారుల నిరంకుశత్వాన్ని తట్టుకోలేకపోయిన ఓ హోంగార్డు హైదరాబాదులోని పేరొందిన వాణిజ్య కేంద్రం కోఠిలో హోర్డింగ్ ఎక్కి నిరసన తెలుపుతున్నాడు. అధికారుల వేధింపులు తట్టుకోలేకనే హోర్డింగ్ ఎక్కానని హోంగార్డు కృష్ణ తెలిపాడు. హోంగార్డ్ కమాండర్ వస్తే తప్ప కిందకు దిగేది లేదని ఆయన తేల్చి చెబుతున్నాడు. హోంగార్డును కిందికి దించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.