: జయ కేసులో అప్పీలుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న కర్ణాటక
అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఉన్నత న్యాయస్థానంలో అప్పీలుకు సంబంధించిన పత్రాలు సిద్ధం చేయాలని న్యాయశాఖ కార్యదర్శికి కర్ణాటక న్యాయ శాఖ మంత్రి టీబీ జయచందన్ ఆదేశాలు జారీ చేశారు. జయ కేసుపై సుప్రీంలో సవాలు చేసే సౌకర్యం ఉందని, ఆ అధికారం కూడా ఉందని ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య అభిప్రాయపడటంతో కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ క్రమంలో జయ నిర్దోషిగా ప్రకటించడంపై స్టే ఇవ్వాలని ముందు కోరనున్నట్టు ఆచార్య తెలిపారు.