: ఏం భయంలేదు...తెలుగు రాష్ట్రాలను భూకంపాలు ఏమీ చేయలేవు: శాస్త్రవేత్తలు


తెలుగు రాష్ట్రాలను భూకంపాలు ఏమీ చేయలేవని శాస్త్రవేత్తలు తెలిపారు. గత నెల 25న వచ్చిన భూకంపం కారణంగా, భూమి పొరల్లో మరిన్ని సర్దుబాట్లు చోటుచేసుకుంటాయని, తద్వారా భూకంప కేంద్రమే కేంద్రంగా మరిన్ని భూకంపాలు వస్తాయని వారు వెల్లడించారు. నేపాల్ లో భూకంప కేంద్రం ఉండడం కారణంగా జోన్ 5లో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో నష్టం సంభవిస్తుందని వారు తెలిపారు. తెలుగు రాష్ట్రాలు రెండూ జోన్ 2 పరిథిలో ఉన్నందువల్ల ఎలాంటి భూకంపాలు సంభవించవని వారు స్పష్టం చేశారు. ప్రకంపనలు వచ్చినంత మాత్రాన భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, భూ పొరల్లో సర్దుబాట్లు జరిగినప్పుడు ప్రకంపనలు సర్వసాధారణం అని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News