: 'పెళ్లా?...కత్రినాకా?... తూచ్'!


బాలీవుడ్ లవ్ కపుల్ కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందని, ఈ నెలాఖరులో వారి పెళ్లి ఉంటుందని, ఈ మేరకు రణబీర్ కపూర్ స్పష్టత కూడా ఇచ్చారంటూ జాతీయ మీడియా గత వారం రోజులుగా కథనాలతో అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. దీనిపై స్పందించిన కత్రినా ప్రతినిధి ఇవన్నీ తప్పుడు కథనాలని ఖండించారు. ఆమె త్వరలో పెళ్లి చేసుకోబోతోందంటూ వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, కత్రినా కైఫ్ కేన్స్ చిత్రోత్సవాల్లో పాల్గోనేందుకు ఫ్రాన్స్ లోని రివెరా వెళ్లింది. కత్రినా ప్రస్తుతానికి అభిషేక్ బచ్చన్ తో 'ఫితూర్', లవర్ రణబీర్ కపూర్ తో 'జగ్గా జాసూస్' సినిమాల్లో నటిస్తోంది.

  • Loading...

More Telugu News