: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఈరోజు మన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత రెండు సెషన్లలో లాభాలను మూటగట్టుకున్న మార్కెట్లు... ఇవాళ 2 శాతం పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 630 పాయింట్లు కోల్పోయి 26,877 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 198 పాయింట్లు పతనమై 8,127కి పడిపోయింది. భూసేకరణ చట్టం, ట్యాక్స్ రీఫామ్స్ కు మరింత సమయం పడుతుందనే అంచనాలతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈనాటి టాప్ గెయినర్స్: గుజరాత్ గ్యాస్ కంపెనీ లిమిటెడ్, క్యాస్ట్రాల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటో కార్ప్, క్రిసిల్. టాప్ లూజర్స్: యూకో బ్యాంక్, హెడీఐఎల్, అదానీ పవర్ లిమిటెడ్, ఫినొలెక్స్ కేబుల్స్, ట్రెంట్ లిమిటెడ్.