: ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ నిర్వహణ కోసం సారథ్య సంఘం ఏర్పాటు
ఆకర్షణీయ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సారథ్య సంఘం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉండే ఈ సంఘంలో 15 మంది సభ్యులుంటారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం సారథ్య సంఘంపై ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావల్సి ఉంది.