: భూకంప ప్రభావ పరిస్థితిపై మోదీ సమీక్ష... సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం
నేపాల్ లో మరోసారి తీవ్ర భూకంపం సంభవించిన నేపథ్యంలో సహయక చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారులను ఆదేశించినట్టు ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. ఈ మేరకు ట్విట్టర్ లో మోదీ ఆదేశాలను పీఎంఓ ట్వీట్ చేసింది. "నేపాల్ లోను, భారత్ లోని పలు రాష్ట్రాల్లోను తాజాగా వచ్చిన భూకంపంపై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు" అని ట్వీట్ చేసింది. అంతేగాక "భూకంపం నేపథ్యంలో అవసరమైన మేరకు సహాయ కార్యక్రమాలు, రక్షణ చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని సంబంధిత విభాగాలకు మోదీ ఆదేశాలు జారీ చేశారు" అని పీఎంవో పేర్కొంది.