: నేపాల్ చౌతారాలో నలుగురు మృతి.... పలువురికి తీవ్ర గాయాలు


నేపాల్, చైనా సరిహద్దులో సంభవించిన తీవ్ర భూకంపం కొంతమందిని పొట్టన పెట్టుకోగా, మరికొంతమందిని క్షతగాత్రులను చేసింది. అక్కడి చౌతారా పట్టణంలో భవనాలు కూలడంతో నలుగురు చనిపోయారని తెలిసింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ రోజు మొత్తం రెండు సార్లు నేపాల్ లో భూకంపం సంభవించిందని అధికారిక సమాచారం. గత నెలలో వచ్చిన భూకంపం మిగిల్చిన నష్టాన్ని పూడ్చుకోకముందే మళ్లీ భూకంపం రావడం ఆ దేశాన్ని మరింత కోలుకోలేని పరిస్థితికి చేర్చిందని చెప్పాలి.

  • Loading...

More Telugu News