: సంగక్కరకు లండన్ ఎయిర్ పోర్టులో అవమానం!


కౌంటీ క్రికెట్ కోసం ఇంగ్లాండ్ వచ్చిన శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర తాను లండన్ ఎయిర్ పోర్టులో అవమానకర పరిస్థితి ఎదుర్కొన్నానని తెలిపాడు. ఓ ఇమ్మిగ్రేషన్ అధికారి తన పట్ల వర్ణ వివక్ష ప్రదర్శించాడని ఆరోపించాడు. కౌంటీల్లో సర్రే జట్టుకు ఆడుతున్న సంగా లండన్ చేరుకున్నాడు. అయితే, విమానాశ్రయంలో తన పట్ల ఓ అధికారి దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, అతి చేశాడని ఈ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ట్విట్టర్లో తెలిపాడు. అయితే, ఘటన తాలూకు పూర్తి వివరాలను సంగా వెల్లడించలేదు. "గత 15 ఏళ్లుగా కౌంటీ క్రికెట్ ఆడుతున్నాను. మునుపెన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. రంగు, మతం, ప్రతిష్ఠదేముంది... ప్రతి ఒక్క ప్రయాణికుడికి మర్యాదనివ్వాలి. తనిఖీలు పక్కాగా ఉండాలి... కాదనను. కానీ, అవతలి వ్యక్తులు కనీస సభ్యత, సంస్కారం ప్రదర్శించాలని మనం ఆశించడంలో తప్పులేదు" అని ట్వీట్ చేశాడు.

  • Loading...

More Telugu News