: నన్ను ఆంజనేయుడే కాపాడాడు: ఢిల్లీలో పొంగులేటి
కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీని భూకంపం వణికించిన నేపథ్యంలో, ఆయన స్పందించారు. ఆంజనేయస్వామి దయతో తమకు ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని తెలిపారు. ఢిల్లీ డేంజర్ జోన్ లో ఉన్నందునే తరచూ ప్రకంపనలు వస్తున్నాయని వివరించారు. భూకంపాల గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు. నేపాల్ తో పాటు ఉత్తర భారతదేశం, తూర్పు తీర ప్రాంతంలో ప్రకంపనలు రావడం తెలిసిందే. ఇప్పటికే అతలాకుతలమైన నేపాల్ తాజా భూకంపంతో మరోసారి హడలిపోయింది.