: ఎవరెస్ట్ శిఖరానికి దగ్గర్లోనే భూకంప కేంద్రం


ఇప్పటికే తీవ్ర భూకంపంతో అతలాకుతలమైన నేపాల్ ను ఈరోజు మరో భూకంపం వణికించింది. ఈ భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మండూ, ప్రఖ్యాత ఎవరెస్ట్ శిఖరానికి మధ్యలో ఉంది. ఎవరెస్ట్ కు సమీపంలో ఉన్న నాంచే బజార్ పట్టణం ఈ భూకంపంతో దెబ్బతింది. ఇటీవల సంభవించిన భూకంపం ధాటికి ఎవరెస్ట్ బేస్ క్యాంపులు ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈరోజు సంభవించిన భూకంపంతో ఖాట్మండూలో భారీ ఎత్తున భవనాలు నేలమట్టమైనట్టు సమాచారం.

  • Loading...

More Telugu News