: గుంటూరు ఫైరింగ్ రేంజీలో మిస్ ఫైర్... కానిస్టేబుల్ ఛాతీలోకి దూసుకెళ్లిన బుల్లెట్!
నిన్న నల్గొండ, నేడు గుంటూరు... పోలీసుల చేతుల్లోని తుపాకులు పేల్చకుండానే గర్జించాయి. వారం క్రితం నల్లగొండలో జరిగిన మిస్ ఫైర్ లో సీఐకి స్వల్ప గాయాలు కాగా, తాజాగా గుంటూరులో చోటుచేసుకున్న మిస్ ఫైర్ ఘటనలో ఓ కానిస్టేబుల్ ప్రాణాపాయ స్థితిలో పడ్డాడు. గుంటూరు ఫైరింగ్ రేంజిలో పోలీసులకు శిక్షణా తరగతులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో కానిస్టేబుల్ ఆనందరావు ఛాతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయనను సహచర పోలీసులు సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. ఆనందరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.