: నేపాల్ లో మరో భారీ భూకంపం... దాని ప్రభావంతోనే భారత్ లో భూప్రకంపనలు
ఇప్పటికే వరుస భూకంపాలతో నేపాల్ నేలమట్టమైంది. ప్రపంచ దేశాల ఆపన్న హస్తంతో మెల్లగా కోలుకుంటున్న ఆ దేశంలో కొద్దిసేపటి క్రితం మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం నేపాల్ రాజధాని ఖాట్మండూకు తూర్పుదిశగా 83 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియలాజికల్ సర్వే ప్రకటించింది. నేపాల్ లో సంభవించిన ఈ భూకంపం కారణంగానే భారత్ లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. తాజా భూకంపం వల్ల నేపాల్ లో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.