: రేపు ఉదయం 10.30లోగా సమ్మె విరమించండి... ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు ఆదేశం
రేపు ఉదయం 10.30లోగా సమ్మె విరమించాలని ఆర్టీసీ కార్మికులను హైకోర్టు ఆదేశించింది. లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ సమయంలో సమ్మె విరమణకు రెండు రోజుల గడువు కావాలని కార్మిక సంఘాలు కోరగా కోర్టు తిరస్కరించింది. తదుపురి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కార్మికులు రేపు సమ్మెను విరమించాల్సి వుంది.