: టీఆర్ఎస్ లోకి ఐఏఎస్ రిటైర్డ్ అధికారి


ఐఏఎస్ రిటైర్డ్ అధికారి కేవీ రమణాచారి రాజకీయ ఆరంగేట్రం చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో సాంస్కృతిక వ్యవహారాల శాఖలోనూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగానూ పని చేసిన రమణాచారి సమర్ధవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. కళలకు, కళాకారులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రమణాచారిని రాజకీయ తెరపైకి తీసుకురావాలన్న ఆలోచనలో కేసీఆర్‌ ఉన్నట్లు టీఆర్‌ఎస్‌లో ఈ మధ్య ప్రచారం జోరందుకుంది. కాగా రమణాచారి మెదక్‌ నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News