: 'స్లమ్ ఫ్రీ సిటీ'గా హైదరాబాద్ ను తీర్చిదిద్దడమే కేసీఆర్ లక్ష్యం: మంత్రి తలసాని


హైదరాబాద్ ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఇందుకోసం సీఎం అనేక ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. ఈ మేరకు స్లమ్ ఫ్రీ సిటీ అంశంపై మంత్రి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచంలో హైదరాబాద్ స్థానం ఏంటో అందరికీ తెలుసునని, నగరంలో జనాభా 5 లక్షల నుంచి పెరుగుతూ కోటికి చేరుకుందని తెలిపారు. మురుగునీరు, రహదార్లు, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని, స్వచ్ఛ హైదరాబాద్ పేరుతో నగరాన్ని పరిశుభ్రంగా చేస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తలసాని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News