: ఈయూ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక నేతల చర్చలు


ఆర్టీసీ సమ్మెపై హైకోర్టుకు చెప్పాల్సిన సమాధానాలపై ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఈయూ కార్యాలయంలో సమావేశమై చర్చిస్తున్నారు. సమ్మె విరమణపై కోర్టుకు చెప్పాల్సిన సమాధానాలపై మంతనాలు జరుపుతున్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కారించాలని కోరతామని పలువురు కార్మిక సంఘాల నేతలంటున్నారు. న్యాయస్థానాన్ని గౌరవిస్తామని, అలాగని సమ్మె విరమణపై కోర్టు గంట సమయం ఇవ్వడం సరైంది కాదని అన్నారు. ఇది గంట వ్యవధిలో తేలే విషయం కాదన్నారు. ఈ కేసులో రెండు ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేయాలని కోరతామంటున్నారు. ఉపసంఘంతో చర్చలు జరిపితే సమస్య మరిత జటిలమయ్యే అవకాశం ఉందని, కార్మిక సంఘాల నేతలంతా సమావేశమై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

  • Loading...

More Telugu News