: సమ్మె విరమణపై గంటలోగా చెప్పాలన్న హైకోర్టు... విచారణ 12.30కు వాయిదా
సమ్మె విరమిస్తారో? లేదో? చెప్పాలంటూ ఆర్టీసీ కార్మికులకు హైకోర్టు గంట సమయం ఇచ్చింది. తరువాత విచారణను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాల్సిందేనని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే యూనియన్లపై చర్యలు తప్పవని వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన ఉపసంఘాలతో చర్చించాలని కోర్టు కార్మికులకు సూచించింది. కోర్టు భావనను యూనియన్లకు చెప్పాలని న్యాయవాదికి హైకోర్టు సూచించింది. ఉపసంఘాలతో చర్చలకు రెండు వారాలు గడువు ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది.