: తెలంగాణ ఎంసెట్ కు నేటితో ముగియనున్న తుది గడువు
తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షకు నేటితో గడువు ముగియనుంది. రూ.10వేల అపరాధ రుసుముతో ఈ అర్ధరాత్రి వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ ఎన్వీ రమణారావు చెప్పారు. ఈ నెల 14న ఎంసెట్ పరీక్ష జరగనుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోనుంది.