: రాహుల్ నియోజకవర్గం అమేథీలో నేడు మంత్రి స్మృతి ఇరానీ పర్యటన
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నియోజకవర్గం అమేథీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె కిసాన్ పంచాయత్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తరువాత భూసేకరణ బిల్లుపై స్థానిక రైతులతో మాట్లాడనున్నారు. పంట నష్టం కారణంగా ఇటీవల చనిపోయిన రైతు కుటుంబాన్ని స్మృతి పరామర్శిస్తారని బీజేపీ నేతలు తెలిపారు. పర్యటనకు ముందు మంత్రి మాట్లాడుతూ, రైతుల భూమి కాపాడేందుకే అమేథీలో ఫుడ్ పార్క్ రద్దు చేసినట్టు మంత్రి చెప్పారు. కార్పోరేటర్లకు భూమి కట్టబెట్టేందుకే రాహుల్ దానిని వ్యతిరేకిస్తున్నారన్నారు.