: అమెరికాలో 'అన్న'గారికి అరుదైన గౌరవం... కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ పంచలోహ విగ్రహం


విశ్వ విఖ్యాత నటసార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావుకు అమెరికాలో అరుదైన గౌరవం లభించనుంది. ఆయన విగ్రహాన్ని కాలిఫోర్నియాలోని వెస్ట్ కొలిన్ వద్ద ఉన్న పార్కులో ఏర్పాటు చేయనున్నారు. కృష్ణావతారంలో ఉన్న ఈ విగ్రహం తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్ కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. జులైలో తానా సభలు జరిగే సందర్భంగా, ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఎనిమిది అడుగుల ఎత్తున్న ఈ విగ్రహాన్ని పంచలోహాలతో తయారుచేశారు. దీని బరువు ఎనభై కిలోలు. ఈ విగ్రహాన్ని రేపు విమానంలో అమెరికాకు తరలిస్తున్నారు.

  • Loading...

More Telugu News