: శ్రీవారిని దర్శించుకున్న 'మా' అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారిని 'మా' అధ్యక్షుడు, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, కార్యవర్గ సభ్యులు శివాజీ, కాదంబరి కిరణ్, ఏడిద శ్రీరాంలు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల రాజేంద్రుడు మీడియాతో మాట్లాడుతూ, స్వామివారి కృపతో 'మా' ఎన్నికల్లో విజయం సాధించామని, అందుకే ఈరోజు దర్శనం చేసుకున్నామని చెప్పారు.