: టెస్టుల్లో మెరుగైన భారత ర్యాంకు... నాలుగో స్థానానికి ఎగబాకిన టీమిండియా


ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో టీమిండియా రెండు మెట్లు పైకెగబాకి నాలుగో స్థానంలో నిలిచింది. మొన్నటిదాకా ఆరో ర్యాంక్ లో ఉన్న ధోనీ సేన, నిన్న విడుదలైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది. టెస్టు మ్యాచ్ లేమీ ఆడకున్నా, వార్షిక లెక్కింపు ఆధారంగా నాలుగు పాయింట్లు దక్కించుకున్న భారత జట్టు, నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దక్షిణాఫ్రికా జట్టు అగ్రస్థానంలోని ఆస్ట్రేలియాను కిందకు తోసేసింది. సఫారీలు టాప్ లో నిలవగా, కంగారూలు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక న్యూజిల్యాండ్ జట్టు మూడో ర్యాంకులో నిలిచింది.

  • Loading...

More Telugu News