: ఇదో పైత్యం...స్కూటీ 50 వేలే...నెంబర్ ప్లేట్ ధర 8.1 లక్షలు


చిత్రవిచిత్రమైన అభిరుచులు కలిగిన వ్యక్తులు తారసపడడం చూస్తుంటాం. ఛండీగఢ్ లో క్యాటరింగ్ బిజినెస్ యజమాని కాన్ వాల్జిత్ వాలియాది ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి. కొత్త వాహనం కొన్న ప్రతిసారీ ఆర్టీఏ ఫ్యాన్సీ నెంబర్ల కోసం వేలంలో పాల్గొనడం, అత్యంత ఎక్కువ ధర పెట్టి ఓ నెంబర్ ను సొంతం చేసుకోవడం అలవాటు. తాజాగా లైసెన్స్ అథారిటీ వేసిన వేలంలో 50 వేల రూపాయలు పెట్టి ఈ మధ్యే కొన్న కొత్త హోండా యాక్టివా స్కూటర్ నెంబర్ కోసం అక్షరాలా 8.1 లక్షల రూపాయలు ఖర్చు చేయడం విశేషం. గతంలో తన కుమారుడు కొన్న బైక్ కు సీహెచ్ 01 బీసీ 0011 నెంబర్ కు 2.6 లక్షలు వెచ్చించిన కాన్ వాల్జిత్ వాలియా, తాజా నెంబర్ సీహెచ్ 1బీసీ 0001 కు భారీ మొత్తం వెచ్చించడం విశేషం.

  • Loading...

More Telugu News