: ఉదయం మాత్రమే చెయిన్ స్నాచింగ్ చేస్తాడు... సాయంత్రానికి ఫ్లయిట్లో చెక్కేస్తాడు!


కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన చెయిన్ స్నాచర్ అబూ బకర్ ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతడు 101 చెయిన్ స్నాచింగ్ కేసుల్లో నిందితుడని పోలీసులు తెలిపారు. అతను దొంగిలించిన బంగారు గొలుసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు అధికారులు దీనిపై మీడియా సమావేశం నిర్వహించారు. అబూబకర్ గ్యాంగ్ గురించి వివరించారు. అతడికి ఐదుగురు అనుచరులు ఉన్నారని తెలిపారు. ఉదయం పూట మాత్రమే చెయిన్ స్నాచింగ్ లు చేస్తాడని, గంటలో కనీసం ఐదు గొలుసులు కొట్టేస్తాడని చెప్పారు. ఇక, సాయంత్రానికి ఫ్లయిట్లో రాష్ట్రం దాటేస్తాడని, దాంతో, నేరం ఎవరు చేశారన్నది తెలుసుకోవడం కష్టమయ్యేదని వివరించారు. ఆ గొలుసులు సొమ్ము చేసుకుని పక్క రాష్ట్రాల్లో జల్సాలు చేసేవాడని, డబ్బులు అయిపోగానే తిరిగి వచ్చి స్నాచింగ్ లకు పాల్పడేవాడని చెప్పారు. ఒక్కోసారి కత్తితో కూడా బెదిరించి దాడులకు వెనుకాడేవాడు కాడని పోలీసులు తెలిపారు. బైక్ నడుపుతూనే గురి తప్పకుండా స్నాచింగ్ చేయడంలో అబూ బకర్ నిపుణుడు.

  • Loading...

More Telugu News