: పేదరికం, అవినీతి నిర్మూలనకు సాంకేతిక రంగం సాయపడుతుంది: మోదీ
పేదరికం, అవినీతి నిర్మూలనకు సాంకేతిక రంగం సాయపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. నేడు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ వేదికగా సాంకేతిక రంగంపై ప్రశంసలు కురిపించారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అంటూ పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలిపారు. సాంకేతిక రంగానికి ప్రజల జీవితాలు మార్చే శక్తి ఉందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన సేవలు అందించేందుకు అన్ని రంగాల్లో సాంకేతికత అవసరం చాలా ఉందని ఆయన తెలిపారు. 1999 నుంచి భారతదేశంలోని జాతీయ సాంకేతికత దినోత్సవం పెద్దఎత్తున జరుపుతున్నారు. ఇంజనీరింగ్, సాంకేతిక విద్యాసంస్థల్లో సాంకేతికత దినోత్సం పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.