: బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు


బ్రిటన్ మంత్రిగా ప్రవాస భారతీయురాలు ప్రీతి పటేల్ (43) నియమితులయ్యారు. రెండోసారి ప్రధానిగా పదవీబాధ్యతలు స్వీకరించిన డేవిడ్ కేమెరాన్ కేబినెట్ లో ప్రీతి పటేల్ ఉపాధి శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విథమ్ స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించిన ప్రీతి 2010లో తొలిసారి బ్రిటన్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. బ్రిటన్, భారత్ మైత్రికి గట్టి మద్దతుదారైన ప్రీతి వరుసగా రెండోసారి పార్లమెంటుకు ఎన్నికై కేబినెట్ లో బెర్తు సంపాదించడం విశేషం. కాగా, 2010లో ఎన్నికైన సందర్భంగా ఆమె పలు పదవులు చేపట్టారు. ప్రీతి పటేల్ కేబినెట్ లో స్థానం సంపాదించడంపై పలువురు భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News