: ఆట చూస్తూ సీలింగ్ పగులగొట్టిన అభిమాని...నష్టం భరిస్తానన్న ఆటగాడు


ఇంగ్లండ్ లో తన అభిమాన ఆటగాడి ప్రదర్శన చూస్తూ రాస్ మోర్గాన్ (25) అనే యువకుడు సీలింగ్ ను బలంగా పిడికిలితో గుద్దాడు. దీంతో అది కాస్తా పగిలింది. దీనిని ఫోటో తీసిన రాస్ మోర్గాన్ 'ఇప్స్విచ్, నార్విచ్ జట్ల మధ్య జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ చూస్తూ మీరు గోల్ కొట్టినప్పుడు ఆనందం పట్టలేక సీలింగ్ పగులగొట్టా'నంటూ తన అభిమాన ఆటగాడు పాల్ ఆండర్సన్ కు ట్విట్టర్లో పంపాడు. దీనిని చూసిన పాల్ స్పందిస్తూ, 'సరే జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తా'నంటూ సమాధానమిచ్చాడు. దీనికి ఉబ్బితబ్బిబైపోయిన అభిమాని 'పాల్ చూస్తాడని సరదాగా పంపించాను. కానీ, ఆయన స్పందిస్తాడని భావించలేదు. ఇది ఆయన గొప్పదనానికి నిదర్శనం' అంటూ పేర్కొంటున్నాడు.

  • Loading...

More Telugu News