: అక్షయ్ కుమార్ కు నోటీసులు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) లీగల్ నోటీసులు పంపించనుంది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమాలో వైద్య వృత్తిని కించపరిచేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఐఎంఏ ఆరోపించింది. పవిత్రమైన వైద్య వృత్తిపై ప్రజలకు నమ్మకం పోయేలా ఈ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఐఎంఏ ఆరోపించింది. రాజకీయాలు, పోలీసులు, ఇతర వృత్తులకు వైద్య వృత్తి భిన్నమైనదని, అలాంటి వైద్యులను కించపరిచేలా సినిమాల్లో చూపించకూడదని ఐఎంఏ వాదిస్తోంది. తక్షణం 'గబ్బర్ ఈజ్ బ్యాక్'లో వైద్యులపై అసంబద్ధంగా ఉన్న సన్నివేశాలు తొలగించాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. కాగా, 'గబ్బర్ ఈజ్ బ్యాక్' సినిమా చాలా బాగుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కితాబివ్వడం విశేషం.