: నాసా పరికరం... నేపాల్లో నలుగురి ప్రాణాలు కాపాడింది
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హృదయ స్పందన గుర్తించే ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది. ఫైండింగ్ ఇండివిడ్యువల్స్ ఫర్ డిజాస్టర్ అండ్ ఎమర్జన్సీ రెస్పాన్స్... సంక్షిప్తంగా ఫైండర్. మైక్రోవేవ్ రాడార్ టెక్నాలజీతో ఈ ఫైండర్ పనిచేస్తుంది. శిథిలాల కింద సజీవంగా ఎవరైనా ఉంటే, వారి హృదయ స్పందన ధ్వనిని ఈ పరికరం గుర్తిస్తుంది. నేపాల్ లో భూకంపం సంభవించగా, సహాయ చర్యల్లో 'ఫైండర్' సేవలు ప్రశంసలు అందుకున్నాయి. దాదాపు నేలమట్టమైన చౌతారా గ్రామంలో ఈ పరికరం నలుగురి ప్రాణాలను కాపాడింది. శిథిలాల కింద ఉన్న వ్యక్తులు ప్రాణాలతో ఉన్నట్టు ఫైండర్ గుర్తించడంతో, అధికారులు వారిని వెంటనే బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ సహాయ కార్యక్రమాల్లో రెండు ఫైండర్లు ఉపయోగించినట్టు నాసా తెలిపింది.