: సత్యం రామలింగరాజుకు బెయిల్


సత్యం కుంభకోణం కేసులో రామలింగరాజుకు బెయిల్ లభించింది. ఆయనతో పాటు సోదరుడు రామరాజుకు కూడా బెయిల్ లభించింది. ఈ మేరకు హైదరాబాదులోని నాంపల్లి ఆర్థిక నేరాల కోర్టు వారికి బెయిల్ మంజూరు చేస్తూ రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. వారితో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 8 మందికి కూడా బెయిల్ ఇచ్చిన న్యాయస్థానం ఒక్కొక్కరూ రూ.50వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. అయితే ఈ కేసులో సెషన్స్ కోర్టు విధించిన భారీ జరిమానాలో 10 శాతంను నెలలోగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News