: గ్రామాల అభివృద్ధిని అడ్డుకునే నేతలను తరిమి కొట్టండి: నారా లోకేష్


గ్రామాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని... జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని టీడీపీ యువనేత నారా లోకేష్ తెలిపారు. అమెరికాలోని డల్లాస్ లో ఎన్నారైలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రామాల అభివృద్ధిని అడ్డుకునే వారిని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. 2005 నుంచి 2014 వరకు అవినీతి ఫ్యాన్సీగా మారిందని... ఎన్ని కేసులుంటే అంత గొప్ప అన్నట్టు తయారయిందని చెప్పారు. అవినీతి నిర్మూలన కోసం టీడీపీ ప్రభుత్వం ఒక సాఫ్ట్ వేర్ ప్రోగ్రాంను తయారుచేస్తోందని లోకేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News