: ఉన్నత విద్యా మండలిపై హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ... సుప్రీంలో పిటిషన్

ఏపీ ఉన్నత విద్యా మండలిపై ఉమ్మడి హైకోర్టు వెల్లడించిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విద్యా మండలి విషయంలో కోర్టు వెల్లడించిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. అసలు ఏపీ ఉన్నత విద్యా మండలి అనేదే ఉండదంటూ తీర్పు ఇవ్వడం సరికాదని తెలిపింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంను కోరింది.