: చేపలాంటి పాపాయి పుట్టింది!


సైన్సుకు అందని అద్భుతాలు ఎన్నో జరుగుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం నిజమవుతుందా? అని అనిపిస్తుంటుంది. పంజాబ్ లోని అమృత్ సర్ లోని రాజసాన్సీ ప్రాంతంలో ఓ పాపకు మహిళ జన్మనిచ్చింది. అచ్చం రబ్బరు బొమ్మలాంటి ఈ పాపాయి ముఖం అచ్చం చేపలా ఉండడం విశేషం. పాప కళ్లు, పెదాలు ఎర్రగా ఉండగా, పాపను ఎవరైనా ముట్టుకుంటే చాలు ఏడుస్తోంది. అయితే, పాప తల్లి పాలు తాగే స్థితిలో కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని, జన్యులోపాల కారణంగా ఇలా జరుగుతుందని, 6 లక్షల మంది పిల్లల్లో ఒకరు ఇలా పుడతారని వైద్యులు వెల్లడించారు. 2014లో ఇలాంటి ఒక పాప జన్మించి, మూడు రోజులకే మృతి చెందిందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News