: మరోసారి రెఫరెండమ్ ఉండదు: డేవిడ్ కేమెరాన్
స్కాట్లాండ్ స్వాతంత్ర్యానికి మరోసారి రెఫరెండమ్ ఉండదని బ్రిటన్ తాజా ప్రధాని డేవిడ్ కేమెరాన్ స్పష్టం చేశారు. గత సెప్టెంబర్ లో స్కాట్లాండ్ స్వాతంత్ర్యానికి రెఫరెండం నిర్వహించగా, అది 45%-55% శాతంతో వీగిపోయిన సంగతి తెలిసిందే. అప్పట్లో బ్రిటన్ చట్టసభలో స్కాట్లాండ్ ప్రాతినిధ్యం కేవలం 5 సీట్లే. తాజా ఎన్నికల్లో స్కాట్లాండ్ లోని మొత్తం 59 సీట్లలో ష్కాటిష్ నేషనలిస్టు పార్టీ 56 సీట్లు గెలుచుకుంది. దీంతో స్కాట్లాండ్ లో మరోసారి రెఫరెండమ్ జరిగే అవకాశం ఉందని, ఇది డేవిడ్ కేమెరాన్ కు తలనొప్పిగా మారే అంశమని బ్రిటన్ పత్రికలు జోస్యం చెప్పాయి. వీటిపై స్పందించిన ఆయన, రెఫరెండమ్ ముగిసిన అంశమని, ప్రజలకు ఏం కావాలో తీర్పు చెప్పారని అన్నారు. మరోసారి రెఫరెండమ్ కు అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.