: మునిగిపోయే పార్టీ కోసం ఎర్రబెల్లి, రేవంత్ పాకులాడుతున్నారు: గువ్వల బాలరాజు


టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విరుచుకుపడ్డారు. మునిగిపోతున్న పడవ లాంటి పార్టీ కోసం వీరిద్దరూ పాకులాడుతున్నారని... వీరికి రాజకీయ అవగాహన లేదనే విషయం దీంతో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో అంతరించిపోయే పార్టీకి నాయకత్వం వహించాలని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఓర్వలేకే వీరిద్దరూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వెన్నుపోటు పొడిచిన చరిత్ర గల టీడీపీ అధినేత చంద్రబాబు... మీకు పార్టీ బాధ్యతలను అప్పగిస్తారని నమ్ముతున్నారా? అంటూ ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News