: ఎర్రబెల్లిపై విరుచుకుపడ్డ ధర్మారెడ్డి
టీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో చేరమని చెప్పింది తెలంగాణ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావే నంటూ ఇటీవల టీఆర్ఎస్ లో చేరిన పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్యాకేజీలు తీసుకునే సంస్కృతి ఎర్రబెల్లిదేనని అన్నారు. పరకాల నుంచి పోటీ చేసేందుకు ఎర్రబెల్లి సై అంటే రాజీనామా చేసేందుకు తాను సిద్ధమని ఆయన సవాలు విసిరారు. ఒకవేళ ఎర్రబెల్లి చేతిలో ఓటమిపాలైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డిలకు మతిభ్రమించిందని ధర్మారెడ్డి విమర్శించారు.