: శివలింగం చుట్టూ తిరిగిందని శునకానికి పూజలు
మనదేశంలో చాలా చోట్ల, చాలా సందర్భాల్లో భక్తికి, మూఢనమ్మకానికి పెద్దగా తేడా కనిపించదు. అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీలోని మౌరానీపూర్ లో చోటుచేసుకుంది. ప్రఖ్యాత మహాకాళేశ్వరాలయంలోని కాలూ అనే ఓ శునకం గత మంగళవారం నుంచి ఆగకుండా ఆదీశ్వరుని చుట్టూ ఆగకుండా ప్రదక్షిణలు చేస్తోంది. దీంతో ఆ శునకానికి శివుని సేవకురాలి పదవిని సైతం కల్పించారు. దీంతో ఇప్పుడు భక్తులు ఆ శునకానికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈశ్వరుడి దర్శనం కోసమే కాకుండా దానిని చూడడానికి కూడా భక్తులు దూరప్రాంతాల నుంచి వస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.