: జయలలిత కేసులో తీర్పుపై కరుణానిధి స్పందన


అక్రమాస్తులో కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడంపై డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. కేసులో ఈ రోజు హైకోర్టు వెలువరించిన తీర్పే తుది తీర్పు కాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కోర్టులను మించిన కోర్టు మనస్సాక్షి అని మహాత్మాగాంధీ అన్నారన్న మాటను ఈ సందర్భంగా కరుణ గుర్తు చేసుకున్నారు. మరోవైపు జయ కేసులో కోర్టు తీర్పుపై ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాలని డీఎంకే నేతలు భావిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News