: మావోల దాడుల కన్నా గుండెపోటు వల్లే ఎక్కువ మంది సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి
వినడానికి బాధగా ఉన్నా... ఇది అక్షరాలా నిజం. కేంద్ర రిజర్వు బలగాల్లో ఒకటైన సీఆర్పీఎఫ్ లో పనిచేసే జవాన్లు ఎక్కువ మంది గుండెపోటుకు గురవుతున్నారు. వృత్తి పరమైన సమస్యలే కాకుండా ఇతర కారణాలు కూడా వారిని వేధిస్తుండటమే దీనికి కారణం. మరో విషయం ఏమిటంటే, మావోయిస్టుల దాడుల్లో మరణించే జవాన్లకన్నా గుండెపోటుతో చనిపోయే జవాన్లే ఎక్కువ. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభాయ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే, ఆత్మహత్యకు పాల్పడుతున్న జవాన్ల సంఖ్య కూడా కలవరపరిచే స్థాయిలో ఉంది. గత ఐదేళ్లలో మావోల దాడిలో 323 మంది జవాన్లు చనిపోగా, గుండె నొప్పితో 642 మంది మృతి చెందారు. ఇదే సమయంలో 228 మంది ఆత్మహత్యలకు పాల్పడగా, 108 మంది మలేరియాతో చనిపోయారు.