: అనంతపురం జైల్లో గుర్నాథరెడ్డి, తోపుదుర్తిలను కలసిన జగన్
అనంతపురం జిల్లా జైల్లో ఉన్న పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డిలను వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ రోజు పరామర్శించారు. వారితో పాటు అక్కడున్న పలువురు పార్టీ కార్యకర్తలను కూడా జగన్ పలకరించారు. ఇటీవల పార్టీ నేత భూమిరెడ్డి శివ ప్రసాద్ రెడ్డి హత్యానంతర అల్లర్ల కేసులో అరెస్టైన వారిద్దరికీ కోర్టు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. హత్యలను సీఎం చంద్రబాబే ప్రోత్సహిస్తున్నారని ఈ సందర్భంగా జగన్ ఆరోపించారు. వ్యూహం ప్రకారమే తమ పార్టీ నేత హత్య జరిగిందని, సూత్రధారులెవరో పోలీసులు విచారణ జరిపి తేల్చాలని ఆయన కోరారు.