: 'మమ్మీ రిటర్న్స్'... జయపై సెటైర్లు
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా పేర్కొనడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. 'మమ్మీ రిటర్న్స్' అని కొందరు సెటైర్లు వేస్తే, సంపన్నులు శిక్ష నుంచి తప్పించుకుంటారన్న విషయం మరోసారి తేటతెల్లమైందని కొందరు పేర్కొన్నారు. తొలుత 'భాయ్' (సల్మాన్), ఇప్పుడు 'అమ్మ'... తర్వాత ఎవరు? అంటూ ఓ యువతి ఆగ్రహం వ్యక్తం చేసింది. నేరస్తులను కుటుంబ సభ్యుల్లా పరిగణిస్తున్నామని, కొత్త ట్రెండ్ అని ఆమె విమర్శించింది. వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఓటర్లు... ఆస్తుల కేసు కళంకిత ఏఐఏడీఎంకే, 2జీ కేసు కళంకిత డీఎంకే పార్టీల్లో ఒకదానిని ఎన్నుకుంటారని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.