: ఆర్టీసీ యాజమాన్యం కలెక్షన్ ఎంతో చెప్పడంలేదు: సీపీఐ


విజయవాడ పాత బస్టాండులో ఆర్టీసీ కార్మిక సంఘాలు భారీ సభ ఏర్పాటు చేశాయి. ఈ సభకు వామపక్షాల నేతలు రామకృష్ణ (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), మధు (సీపీఎం రాష్ట్ర కార్యదర్శి) కూడా హాజరయ్యారు. ఈ సభలో రామకృష్ణ మాట్లాడుతూ... సమ్మె కాలంలో బాగానే బస్సులు తిప్పుతున్నామని చెబుతున్న ఆర్టీసీ యాజమాన్యం, కలెక్షన్ ఎంతో చెప్పడంలేదని అన్నారు. ఎంత ఆదాయం వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, కానీ, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమ్మెను అణచివేసేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News